విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ డీవీఆర్ కాలనీలో సోమవారం ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఘటనలో పిల్లలు, మహిళలు అస్వస్థతకు గురయ్యారు. మిగిలిపోయిన మిఠాయిలు తినటం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర అస్వస్ధతకు గురైనవారిని స్థానికులు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వైద్యులు విజయవాడకు తరలించారు.
పెళ్లిళ్లలో వంట పనులు చేసే మహిళలు.. వడ్డించిన స్వీట్ కోవా మిగలడంతో ఇంటికి తీసుకువెళ్లారు. తీసుకువెళ్లిన కోవాను వారి పిల్లలు, వారు తినటంతో అస్వస్ధతకు గురయ్యారు. అస్వస్ధకు గురైనవారు ప్రస్తుతం చికిత్స విజయవాడ పాత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.